News October 26, 2025
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్

పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 26, 2025
అల్లూరి జిల్లాలో అన్ని పాఠశాలలకు 2 రోజుల సెలవులు

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 28, 29వ తేదీల్లో సెలవులు ఇవ్వాలని అధికారులను టెలీ కాన్ఫెరెన్సులో ఆదేశించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, కంట్రోల్ రూమ్ నం.7780292811 సంప్రదిస్తే సహాయక చర్యలు చేపడతామన్నారు.
News October 26, 2025
VJA: అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ పోస్ట్‌ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 29లోపు https://crda.ap.gov.in/లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.
News October 26, 2025
స్టార్ క్యాంపెయినర్స్‌గా సోనియా, రాహుల్, ప్రియాంక

బిహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు KC వేణుగోపాల్, భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్ తదితరుల పేర్లనూ చేర్చింది. NOV 6, 11 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.


