News October 26, 2025

కవిత ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా?

image

నిజామాబాద్‌లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటమికే <<18110074>>BRS ఎమ్మెల్యేలే<<>> కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు <<18102361>>కుట్ర పన్నరాని<<>> పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మెుదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా BRS నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై BRS నేతలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా వేచి చూడాలి.

Similar News

News October 26, 2025

శ్రీకాకుళం: విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు

image

జిల్లాలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఆదివారం తెలిపారు. తుపాన్ కారణంగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామన్నారు. మూడు రోజుల పాటు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు బయట తిరగొద్దని సూచించారు.

News October 26, 2025

అల్లూరి జిల్లాలో అన్ని పాఠశాలలకు 2 రోజుల సెలవులు

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 28, 29వ తేదీల్లో సెలవులు ఇవ్వాలని అధికారులను టెలీ కాన్ఫెరెన్సులో ఆదేశించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, కంట్రోల్ రూమ్‌ నం.7780292811 సంప్రదిస్తే సహాయక చర్యలు చేపడతామన్నారు.

News October 26, 2025

VJA: అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ పోస్ట్‌ను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 29లోపు https://crda.ap.gov.in/లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.