News October 26, 2025
GNT: వరుస సెలవులు.. హాస్టల్స్ ఖాళీ చేసి వెళుతున్న విద్యార్ధులు

తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్ధులు ఇళ్ల బాట పట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెనాలిలోని పలు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్న స్కూల్స్ , కాలేజీల విద్యార్ధులు వర్షాలకు ముందు జాగ్రత్తగా ఆదివారమే ఖాళీ చేసి తమ తమ స్వస్థలాలకు బయలుదేరారు. కొన్ని ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్స్ మాత్రం విద్యార్ధులను అక్కడే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Similar News
News October 26, 2025
గుంటూరు జిల్లా తుఫాన్ కంట్రోల్ రూమ్ నంబర్‌లు

GNT కలెక్టరేట్: 0863-2234014
GMC: 0863-2345103
TNL సబ్ కలెక్టర్ ఆఫీస్: 9866671291
గుంటూరు RDO ఆఫీస్: 0863-2240679
మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్: 08645-295192
పొన్నూరు: 08643-247737
తెనాలి: 1800-425 6468
మేడికొండూరు: 9949098615
పెదకాకాని: 9949098617
పెదనందిపాడు: 9949098619
ఫిరంగిపురం: 9949098620
ప్రత్తిపాడు: 9949098621
తాడికొండ: 9949098624
తుళ్లూరు: 9849904017
దుగ్గిరాల: 7032929351.
News October 26, 2025
3 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సిసోడియా

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ ఆర్.పి. సిసోడియా ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తదితరులు పాల్గొన్నారు.
News October 26, 2025
GNT: ‘మొంథా’ తుఫాన్.. స్కూల్ హాలిడేస్‌పై గందరగోళం

‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రైవేట్ స్కూల్స్ నుంచి సమాచారం రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సెలవు కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా లేక ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందా అనే అయోమయంలో పడ్డారు.


