News October 26, 2025
GWL: కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సులు-DM

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 28, 29 తేదీల్లో గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సునీత ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ట్రిప్పు గద్వాల నుంచి బయలుదేరి అనంతరం ఆత్మకూరు నుంచి కురుమూర్తి వరకు అవసరమైనన్ని ట్రిప్పులు నడుస్తాయన్నారు. భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తామని CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ‘‘నా తండ్రి, RJD చీఫ్ లాలూ ప్రసాద్ దేశంలో మతతత్వ శక్తుల విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కారు. కానీ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడూ వారికి మద్దతిస్తారు. ఆయన వల్లే RSS రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. BJPని ‘భారత్ జలావో పార్టీ’ అని పిలవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.
News October 26, 2025
ADB: గుంజాల శివారులో పెద్దపులి సంచారం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుంజాల గ్రామ శివారులో పెద్ద పులి సంచరించింది. అదివారం పశువుల మేతకి వెళ్లిన రైతులకు పెద్దపులి కంట పడింది. దీంతో రైతులు పరుగులు పెట్టి గ్రామానికి చేరుకున్నారు. భయాందోళన గురైన ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. పులి అడుగులని నిర్ధారించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ ఫారెస్ట్ నుంచి తరచూ పులుల రాకతో మండలవాసులు బెంబేలెత్తుతున్నారు.
News October 26, 2025
యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


