News October 26, 2025
మొంథా తుఫాను.. ప్రజలకు జగన్ సూచనలు

AP: మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని YCP అధినేత జగన్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలను NOV 4కు వాయిదా వేసినట్లు వైసీపీ వెల్లడించింది.
Similar News
News October 27, 2025
సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించాం: నాదెండ్ల

AP: సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా ఎంపిక చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు తగిన అవకాశం కల్పించాలని Dy.CM పవన్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమని ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు.
News October 26, 2025
గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తామని CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ‘‘నా తండ్రి, RJD చీఫ్ లాలూ ప్రసాద్ దేశంలో మతతత్వ శక్తుల విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కారు. కానీ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడూ వారికి మద్దతిస్తారు. ఆయన వల్లే RSS రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. BJPని ‘భారత్ జలావో పార్టీ’ అని పిలవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.
News October 26, 2025
అల్పపీడనం, వాయుగుండం అంటే?

సముద్రంపై ఉండే వేడి గాలులు నీటి బిందువులను ఆవిరిగా మార్చి తక్కువ పీడనం ఉన్న వైపునకు పయనిస్తాయి. దీన్ని అల్పపీడన ద్రోణి అని అంటారు. ఈ ద్రోణి నీటి బిందువులను ఆకర్షిస్తూ అల్పపీడనంగా మారుతుంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు వస్తుంది. ఆపై వాయుగుండం(31-50Kmph గాలులు)గా, మరింత బలపడితే తీవ్ర వాయుగుండం(51-62kmph గాలులు)గా ఛేంజ్ అవుతుంది. గాలుల వేగం 62Kmph దాటితే తుఫానుగా పరిగణిస్తారు.


