News October 26, 2025
వనపర్తిలో పోలీసుల సైకిల్ ర్యాలీ

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉంటుందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. సైకిల్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ ప్రారంభించి పోలీస్ అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారని అన్నారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగుతుందన్నారు.
Similar News
News October 27, 2025
ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News October 27, 2025
ASF: నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

ASF జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపుకు 680 మంది వ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులపై లక్కీ డ్రా కార్యక్రమం నేడు జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ASF, కెరమెరి-గోయాగాం, WKD, తిర్యాని, గూడెం మండలాల్లో ఉన్న దుకాణాలకు తమ పేర్లు లక్కీ డ్రాలో ఎంపికైతే అదృష్టం తలుపు తట్టినట్లే అంటూ వ్యాపారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News October 27, 2025
అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం


