News October 26, 2025
రేపు ఉదయం 11గంటలకు..

TG: మద్యం దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక లాటరీ పద్ధతిలో రేపు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహణ జరగనుంది. మద్యం దుకాణాల లాటరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్‌లో 100 మద్యం దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్‌నగర్‌లో 134 మద్యం షాపులకు 7,845 అప్లికేషన్లు వచ్చాయి.
Similar News
News October 27, 2025
పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
News October 27, 2025
ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News October 27, 2025
అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం


