News October 26, 2025
NGKL: రేపే మద్యం దుకాణాల కేటాయింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డీప్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టనున్నారు. మద్యం దుకాణాల కోసం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులలో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
Similar News
News October 27, 2025
KMR: ‘లిక్కర్ లక్కు’ ఎవరిని వరించనుంది..?

కామారెడ్డి జిల్లాలోని 49 వైన్స్ షాపుల కేటాయింపు కోసం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 49 వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. 45.06 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించే లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం వరిస్తుందో, మద్యం షాపులు ఎవరికి దక్కుతాయోనని జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
News October 27, 2025
GNT: 39 ఏళ్ల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు.!

ప్రముఖ పండితులు, కవి శిఖామణి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు, గద్య స్తోత్రాలు, దండకాలు, శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. 27-10-1914 నాడు ఆయన మరణించారు.
News October 27, 2025
పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.


