News October 27, 2025

బాపట్ల: అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

image

బాపట్ల జిల్లాకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కేటాయించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన వేణుగోపాల్ రెడ్డి ఆదివారం బాపట్ల కలెక్టరేట్‌కు విచ్చేసి తుపాను నేపథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్, ఎస్పీ ఆయనకు వివరించారు. తుపాను ప్రభావంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

Similar News

News October 27, 2025

అభయారణ్యంలోకి 29 వరకు సందర్శకుల రాక నిషేధం

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 29 వరకు కోరింగ అభయారణ్యంలోకి సందర్శకుల రాకను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారి వరప్రసాద్ తెలిపారు. అటు ఇప్పటికే తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాగా.. ఉప్పాడ, కొత్తపల్లి సహా 6 మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. అటు ఈనెల 31 వరకు విద్యార్థులకు హాలిడే ప్రకటించారు.

News October 27, 2025

భూ వినియోగ మార్పిడికి ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు

image

AP: భూ వినియోగ మార్పులకు (చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరు కానున్నాయి. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(DPMS) పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న 45 రోజుల్లోగా అనుమతులిస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యక్తులు ఆన్‌లైన్ దరఖాస్తుకు రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేసింది.

News October 27, 2025

HYD: కౌన్ బనేగా బైపోల్‌కా బాద్‌షా?

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా నాయకులు వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానంలో సత్తా చాటాలని BRS భావిస్తోంది. రాజధానిలో గెలిచి రాష్ట్రమంతా తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని కాంగ్రెస్ కదనరంగంలోకి దిగింది. భాగ్యనగరంలో బోణీ కొట్టాలని BJP బరిలోకి దూకింది. జూబ్లీహిల్స్‌లో విజేత ఎవరు అనుకుంటున్నారు? COMMENT