News April 9, 2024

T20 వరల్డ్ కప్: భారత జట్టులోకి పంత్?

image

కారు ప్రమాదంలో గాయపడటంతో దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమైన రిషభ్ పంత్.. IPLలో ఢిల్లీ కెప్టెన్‌గా రాణిస్తున్నారు. టీమ్ గెలుపుకోసం శాయశక్తులా శ్రమిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు పంత్‌ను సెలెక్ట్ చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు క్రిక్‌బజ్ నివేదించింది. భారత జట్టులో ఆయనకు స్థానం ఉంటుందట. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 10, 2024

నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం

image

AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

News October 10, 2024

ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.

News October 10, 2024

పల్లె పండుగ పనులపై మార్గదర్శకాలు జారీ

image

AP: పల్లె పండుగ పేరిట పంచాయతీల్లో ఈ నెల 14- 20వ తేదీ వరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పనులను JAN నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలంది. జియో ట్యాగింగ్ సహా అన్ని వివరాలను పీఆర్ వన్ యాప్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించింది. సోషల్ ఆడిట్ అనంతరం బిల్లులు చెల్లిస్తామంది.