News October 27, 2025

MHBD: 61లిక్కర్ షాపులకు లక్కీ పర్సన్స్ ఎవరో..!

image

మహబూబాబాద్ జిల్లాలో 61 లిక్కర్ షాపులు ఉన్నాయి. ఈ నెల 23న లిక్కర్ షాపులకు దరఖాస్తుల గడువు ముగిసింది. జిల్లాలో 61 లిక్కర్ షాపులకు 1800 దరఖాస్తులు అందాయి. AB ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. లక్కీ డ్రా లో 61 లక్కీ పర్సన్స్ ఎవరనేది తేలనున్నది. కొత్త లిక్కర్ షాపులను కేటాయించనున్నారు.

Similar News

News October 27, 2025

VJA: గంజాయి మత్తు.. యువత చిత్తు

image

తేలికగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడిన యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి రవాణా జరుగుతోంది. ఈ నెల 15న జి. కొండూరు (M) చెవుటూరులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21న తిరువూరు (M) చిట్టీల వద్ద బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకుల వద్ద 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. రూరల్లో వరుసగా గంజాయి నిందితులు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది.

News October 27, 2025

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ గ‌డువు పొడిగింపు

image

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. తాజాగా దరఖాస్తు గడువు తేదీని నవంబర్ 20 వరకు పొడిగించారు.
వెబ్‌సైట్‌: <>https://www.cbse.gov.in<<>>

News October 27, 2025

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ భద్రత

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన గేటు వద్ద ఏసీపీ, 3 ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు SIలు, 8 మంది ASIలు, 41 మంది కానిస్టేబుళ్లు ఉండనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఒక ప్లాటూన్ సాయుధ బలగాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండనున్నాయి. స్టేడియానికి వెళ్లే రోడ్డులో 6 పికెటింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు.