News October 27, 2025

అభయారణ్యంలోకి 29 వరకు సందర్శకుల రాక నిషేధం

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 29 వరకు కోరింగ అభయారణ్యంలోకి సందర్శకుల రాకను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారి వరప్రసాద్ తెలిపారు. అటు ఇప్పటికే తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాగా.. ఉప్పాడ, కొత్తపల్లి సహా 6 మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. అటు ఈనెల 31 వరకు విద్యార్థులకు హాలిడే ప్రకటించారు.

Similar News

News October 27, 2025

కరూర్ తొక్కిసలాట బాధితులతో విజయ్ భేటీ

image

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను నటుడు, TVK చీఫ్ విజయ్ కలిశారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్ చేసి పార్టీ నేతలు బస్సుల్లో వారిని అక్కడికి తీసుకెళ్లారు. బాధితులతో విజయ్ మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు మృతుల కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే.

News October 27, 2025

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

image

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.

News October 27, 2025

వికారాబాద్: లక్ ఎవరిదో కాసేపట్లో తేలనుంది

image

వికారాబాద్ జిల్లాలోని 59 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన డ్రా తీసేందుకు ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. డ్రా కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.