News October 27, 2025
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు అపహరణ

ఇంటికి తాళాలు వేసి చుట్టాల ఇంటికి వెళ్లిన వృద్ధ దంపతుల ఇంటిలో దుండగులు చొరబడి రూ.1.60 లక్షల విలువైన బంగారం, నగదును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఏలూరు త్రీ టౌన్‌లోని శ్రీరామ్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన ఇంటి యజమాని బాలగంగాధర్ తిలక్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
Similar News
News October 27, 2025
సంగారెడ్డి: వైజ్ఞానిక ప్రదర్శన పోటీలకు సిద్ధంకండి: జిల్లా సైన్స్ అధికారి

ఇన్‌స్పైర్ మనక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నవంబర్ రెండో వారంలో జరుగుతాయని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి సోమవారం తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రయోగాలు తయారు చేయాలని ఆయన కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
News October 27, 2025
వేరుశనగ వరద ముంపునకు గురైతే ఏం చేయాలి?

సాధ్యమైనంత వేగంగా పొలం నుంచి నీటిని తీసివేయాలి. ఈ సమయంలో టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్ని గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో టెబుకోనజోల్ 200ml లేదా హెక్సాకొనజోల్ 400ml కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. ఐరన్ లోపం కనిపిస్తే లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా.తో పాటు సిట్రిక్ యాసిడ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News October 27, 2025
మరోసారి భారత్‌ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్‌కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్‌ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్‌ఈస్ట్ స్టేట్స్‌పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.


