News October 27, 2025

పిట్లం: తండ్రికి కల్లులో విషం.. కొడుకు ఘాతుకం..!

image

వృద్ధుడైన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన ఆ కొడుకు.. తండ్రి తాగే కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం(M) గౌరారం తండాలో శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI వెంకట్రావ్ ప్రకారం.. తండావాసి దశరథ్ కొడుకు వామన్ వద్దుంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడు. కేసు నమోదు చేసి, నిందితుడైన వామన్‌ను ఆదివారం రిమాండ్‌కు తరలించారు

Similar News

News October 27, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

image

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News October 27, 2025

‘మొంథా’ తుఫాను.. అగ్నిమాపక బృందాలు సిద్ధం

image

‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప.గో. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఏడు ఫైర్‌ ఇంజన్లు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్‌ జాకెట్లు, 40 లైఫ్‌ బాయ్స్‌, 30 రోప్‌లతోపాటు అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా తుఫాన్‌ సమయంలో పడిపోయే చెట్లను తొలగించడానికి 12 బృందాలతో కూడిన 24 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

News October 27, 2025

ఏడాదిలో ఒక్కసారైనా చేసుకోవాల్సిన టెస్టులు!

image

* CBC (కంప్లీట్ బ్లడ్‌కౌంట్): రక్తహీనత & ఇన్ఫెక్షన్లను తెలిపేది
* HbA1c: రక్తంలో దీర్ఘకాలిక చక్కెర స్థాయులను చూపేది
* లిపిడ్ ప్రొఫైల్: గుండె జబ్బుల ప్రమాదాన్ని వెల్లడించేది
* విటమిన్-D: అలసట & రోగ నిరోధకశక్తి తక్కువగా ఉందని తెలిపేది
* విటమిన్ B12: మానసిక ఆరోగ్యం & నరాల పనితీరు అంచనా కోసం
* సి-రియాక్టివ్ ప్రొటీన్ (CRP): శరీరంలో వాపును సూచించేది
* LFT& KFT టెస్ట్: లివర్, కిడ్నీ పనితీరు అంచనా వేసేది