News October 27, 2025
గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
Similar News
News October 27, 2025
అసలైన భక్తులకు ప్రతిదీ దైవమే!

సమస్త జీవుల్లో దేవుణ్ని చూస్తూ, వాటిని సంతోషపెట్టడమే నిజమైన ఈశ్వర పూజ. మనసులో భగవంతుణ్ని స్థాపించుకున్న భక్తులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. స్థిరమైన, అవిచ్ఛిన్నమైన భక్తిని కలిగి ఉంటారు. అలాంటి భక్తులు తమ పనులన్నింటినీ భగవత్ సేవగానే భావించి, అంకితభావంతో చేస్తాడు. అందువల్ల వారికి వేరే ధ్యానం, ఆరాధన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. అతని ప్రతి కర్మ నిరంతర పూజగా మారుతుంది.<<-se>>#Daivam<<>>
News October 27, 2025
సెక్సీయెస్ట్ లయన్‌ను చూశారా?

ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన సింహం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మసాయి మారా(కెన్యా) అడవిలో ఉండే ఈ రింగుల జుట్టు మృగరాజును ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్లిక్ చేయగా వైరలవుతోంది. రంగురంగుల జూలుతో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ సింహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మృగరాజు నిజమైన అందానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మోడల్స్‌కు పోటీనిస్తూ సెక్సీయెస్ట్ లయన్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.
News October 27, 2025
వార్డ్‌రోబ్ ఇలా సర్దేయండి

చాలామంది వార్డ్‌రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్‌రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్‌రోబ్ నీట్‌గా కనిపిస్తుంది.


