News October 27, 2025

ఖమ్మంలో క్లాక్‌ టవర్.. స్పెషాలిటీ ఇదే

image

ఖమ్మానికి కొత్తశోభ రానుంది. నగరంలోని ఇల్లందు క్రాస్‌రోడ్‌లో రూ. 1.25కోట్లతో క్లాక్ టవర్ నిర్మించనున్నారు. నిర్మాణానికి ప్రపంచగుర్తింపు పొందిన బ్లాక్ గ్రానైట్ రాయిని ఉపయోగించడంతో పాటు స్తంభాద్రి నరసింహస్వామి, ఖిల్లా, ఇతర చారిత్రక అంశాలు ప్రతిబింబించేలా రూపకల్పన చేయనున్నారు. ఈ టవర్ నిర్మాణం పూర్తయితే నగరానికి ల్యాండ్ మార్క్‌గా నిలవనుంది. ఇప్పటికే నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

Similar News

News October 27, 2025

చోది మేళ్లలొ చోరీ.. రూ.15 లక్షల సొత్తు అపహరణ

image

ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చోదిమెళ్లకి చెందిన బాధితుడు వేమూరి అనంతరామ్ వివరాల మేరకు.. తాను తన కుటుంబంతో కలిసి 26న పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తిరిగి సోమవారం వచ్చి చూడగా, తలుపు తాళాలు, బీరువా ధ్వంసమై ఉన్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైందన్నారు. క్లూస్‌టీం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

News October 27, 2025

RGM: 1,000 మంది విద్యార్థులతో ఓపెన్ హౌస్..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.

News October 27, 2025

నేరస్థులను తరలించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి: CP

image

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 86 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. పీడీ యాక్ట్, రౌడీ హిస్టరీ షీటర్లకు ఠాణాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నేరస్థులను ఠాణాలకు తరలించేటప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.