News October 27, 2025

గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్‌కు దీప్తి పెయింటింగ్

image

జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి పెయింటింగ్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్‌కు వేశారు. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును సైతం దీప్తి సొంతం చేసుకుంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో భాగంగా రెండు స్వర్ణాలను సాధించింది. దీంతో ప్రభుత్వం ఆమె పెయింటింగ్‌ను పిల్లర్‌పై వేయించింది.

Similar News

News October 27, 2025

చోది మేళ్లలొ చోరీ.. రూ.15 లక్షల సొత్తు అపహరణ

image

ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చోదిమెళ్లకి చెందిన బాధితుడు వేమూరి అనంతరామ్ వివరాల మేరకు.. తాను తన కుటుంబంతో కలిసి 26న పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తిరిగి సోమవారం వచ్చి చూడగా, తలుపు తాళాలు, బీరువా ధ్వంసమై ఉన్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైందన్నారు. క్లూస్‌టీం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

News October 27, 2025

RGM: 1,000 మంది విద్యార్థులతో ఓపెన్ హౌస్..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.

News October 27, 2025

నేరస్థులను తరలించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి: CP

image

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 86 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. పీడీ యాక్ట్, రౌడీ హిస్టరీ షీటర్లకు ఠాణాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నేరస్థులను ఠాణాలకు తరలించేటప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.