News October 27, 2025
నర్వ: వారు చేసిన పని.. ఒక ప్రాణం తీసింది!

గత వారం గాజులయ్య తండా సమీపంలో రోడ్డుకు ఉన్న చెట్లకు పశువులను కట్టేయడంతో, బైక్‌పై వెళ్తున్న నర్వ మండలం ఉందేకోడు గ్రామానికి చెందిన వాటర్‌మెన్ నర్సింలు (52) అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రోడ్డు పక్కన పశువులను కట్టేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 27, 2025
HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.
News October 27, 2025
మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.


