News October 27, 2025
మామునూర్: నిందితుల పరారీ.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్

కొద్ది రోజుల క్రితం మామునూరు పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు గంజాయి నిందితులు పరారైన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ, స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌కు మెమో జారీ చేసినట్లు సమాచారం. పరారైన ఇద్దరు నిందితులు గంజాయి విక్రయిస్తూ టాస్క్‌ఫోర్సు పోలీసులకు పట్టుబడగా వారిని మామునూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
Similar News
News October 27, 2025
డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా

యంగ్ ప్లేయర్ పృథ్వీ షా రంజీలో డబుల్ సెంచరీ బాదారు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున 144 బంతుల్లోనే 200 మార్క్ దాటారు. ఇది రంజీ హిస్టరీ ఎలైట్ గ్రూప్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం. 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 బంతుల్లో 222 రన్స్ చేశారు. ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో జాతీయ జట్టుకు దూరమైన షా దేశవాళీల్లో రాణిస్తున్నారు.
News October 27, 2025
BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్‌బంధన్‌లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.
News October 27, 2025
MBNR: పటేల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తాం: డీకే అరుణ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. మహబూబ్‌నగర్ క్యాంపు ఆఫీస్‌లో ‘యూనిటీ మార్చ్’ పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఏక్ భారత్-ఆత్మనిర్బర్ భారత్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశ సమైక్యత కోసం పోరాడిన పటేల్ ఆశయ సాధనే అందరి లక్ష్యమని అరుణ అన్నారు.


