News October 27, 2025
ఎన్టీఆర్: వాయిదా పడిన కేంద్ర మంత్రి నిర్మల అమరావతి పర్యటన

అమరావతిలో మంగళవారం జరగాల్సిన బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. కార్యక్రమం జరిగే తదుపరి తేదీ తెలియాల్సి ఉంది. కాగా ఉద్దండరాయునిపాలెంలో 12 బ్యాంకులకు CRDA స్థలాలు కేటాయించగా..శంకుస్థాపన జరిగిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Similar News
News October 27, 2025
డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.
News October 27, 2025
ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 27, 2025
HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.


