News April 9, 2024
ఆపరేషన్ సమయంలో మూసేవాలా సాంగ్ ప్లే చేశారు!

ఆపరేషన్ థియేటర్లో రోగికి చికిత్స చేసే సమయంలో అతనికిష్టమైన హీరో సినిమా, సాంగ్స్ ప్లే చేస్తుండటం చూస్తుంటాం. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన మూడున్నరేళ్ల బాలుడికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు సిద్ధు మూస్‌వాలా సాంగ్‌ను ప్లే చేశారు. పంజాబ్ జాగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ‘జట్ డి మషూక్ బిబా రష్యా టూన్’ ప్లే చేయగా బాలుడు ఉత్సాహంగా కనిపించాడట.
Similar News
News March 14, 2026
సీఈసీని ఎలా తొలగించవచ్చు?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం <<19371253>>ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను<<>> తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమవ్వాలి. తొలగింపునకు గల కారణాలతో ఓ తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. LSలో 100, RSలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/ఛైర్మన్‌కు సమర్పించాలి. దాన్ని వారు అంగీకరిస్తే ఓటింగ్‌లో 2/3 మెజార్టీ రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.
News March 14, 2026
దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

భారత దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌కు BCCI ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రకటించింది. రేపు ఢిల్లీలో జరిగే నమన్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవంలో వీరిని సత్కరించనుంది. ఈ ముగ్గురినీ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో గౌరవించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ప్లేయర్లు కనబరిచిన అసామాన్య ప్రతిభను గుర్తిస్తూ ఏటా నమన్ అవార్డుల ప్రదానం జరుగుతుంది.
News March 14, 2026
4 రోజులుగా ICUలో తమ్మినేని వీరభద్రం

TG: CPI(M) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం గత 4 రోజులుగా గచ్చిబౌలి (HYD) AIG హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు BV.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఇతర నాయకులు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.


