News October 27, 2025

KNR: నేడే LUCKY ‘డ్రా’ప్.. ఎంట్రీపాస్ MUST..!

image

2025 DEC 1- 2027 NOV 30 వరకు మద్యంషాపులు నిర్వహించేందుకు టెండర్‌దారులు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం టెండర్లకు సంబంధించి ‘లక్కీ డ్రా’ తీయనున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఎంట్రీపాసులు ఉంటేనే లోనికి అనుమతిస్తారు. ఫోన్లను పర్మిషన్ లేదు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 షాపులకు 7,584 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.228 కోట్ల ఆదాయం వచ్చింది.

Similar News

News October 27, 2025

ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

image

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.

News October 27, 2025

మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

image

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.