News October 27, 2025

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.. యథావిధిగా పాఠశాలలు

image

ప్రభుత్వ ఆదేశాలను కొన్ని విద్యా సంస్థలు పాటించడం లేదని పలువురు అంటున్నారు. తుపాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో 3 రోజులపాటు కలెక్టర్ పాఠశాలలు సెలవు ప్రకటించినప్పటికీ సూర్యలంక కేంద్రీయ విద్యాలయం మాత్రం సెలవు ప్రకటించలేదని అంటున్నారు. పాఠశాలను నిర్వహిస్తుండటంతో సోమవారం విద్యార్థులు యథాతధంగా పాఠశాలకు వెళ్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 27, 2025

భారత్‌తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

image

వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్‌గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్‌కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.

News October 27, 2025

పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వండి: ఎస్పీ

image

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. సోమవారం అమలాపురం పోలీసు కార్యాలయంలో ఐదు ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలకు సంబంధించిన వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు.

News October 27, 2025

పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర కష్టం: మంత్రి తుమ్మల

image

TG: పత్తి రైతులకు గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి అమ్మకాల విషయంలో రైతులు CCI ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, తేమను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా చూసుకోవాలని.. 12 శాతానికి మించి తేమ ఉంటే కనీస మద్దతు ధర పొందడం కష్టమన్నారు. దీనికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.