News October 27, 2025
JGTL: మున్సిపాలిటీలకు నిధులు.. జిల్లాలో ‘క్రెడిట్ వార్’

కోరుట్ల- మెట్‌పల్లి మున్సిపాలిటీల(ఒక్కోదానికి రూ.18.70 కోట్లు)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.37.40 కోట్లు UIDF పథకం కింద మంజూరు చేసింది. అయితే ఈ నిధులు తేవడం విషయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మధ్య ‘క్రెడిట్ పోటీ’ నెలకొంది. మరోవైపు బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం వల్లే ఈ నిధులు మంజూరు అయినట్లు సోషల్ మీడియాలో తెగప్రచారం చేస్తూ స్టేటస్లు వైరల్ చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.
News October 27, 2025
ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>
News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.


