News October 27, 2025
కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సోమవారం 3 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07132 నరసాపురం-తిరుపతి, నం.07033 నరసాపురం-మైసూరు, నం.07445 కాకినాడ-లింగంపల్లి మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో, ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News October 27, 2025
HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.
News October 27, 2025
ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>
News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.


