News October 27, 2025

కొత్తపల్లి: మతిస్థిమితం లేకే తల్లిని చంపిన కుమారుడు: పోలీసులు

image

కొత్తపల్లి మండలం గోకుల్ నగర్‌లో తల్లి భీమమ్మను హత్య చేసిన కుమారుడు రామకృష్ణకు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక అతను గ్రామంలో తిరుగుతున్నాడని సీఐ సైదులు, ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న తల్లిని పార, బండరాయితో మోది చంపినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 27, 2025

AI సాయంతో మ్యాథ్స్‌లో రఫ్ఫాడిస్తున్నారు!

image

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా విద్యార్థులు AI సాయంతో చదువులో అదరగొడుతున్నారు. ‘PadhaiWithAI’ ప్లాట్‌ఫామ్‌లో అభ్యసించేలా కలెక్టర్ సౌమ్య ఝా విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో కేవలం 6 వారాల్లో 10వ తరగతి గణితం పాస్ పర్సంటేజ్ 12% నుండి 96.4%కి పెరిగింది. ఇది సంప్రదాయ విద్యలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కలెక్టరే స్వయంగా విద్యార్థులపై శ్రద్ధపెట్టి పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది.

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో త్వరలో రేవంత్ రెడ్డి ప్రచారం

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపు కోసం నాయకులు ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. 2రోజుల పాటు స్థానికంగా పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏఏ తేదీల్లో ప్రచారం చేయాలనేది గాంధీ భవన్ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.

News October 27, 2025

డ్రగ్స్ రహిత సమాజం కోసం సంఘటితంగా పోరాడాలి: స్వప్నారాణి

image

డ్రగ్స్ రహిత సమాజం కోసం సంఘటితంగా పోరాడాలని PDPL జిల్లా సీనియర్ సివిల్ జడ్జి(DLSA) స్వప్నారాణి పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో నశా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఆమె చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలు చెడువ్యసనాల జోలికి పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ డ్రగ్స్ ముప్పు నుంచి యువతను దూరంగా ఉంచాలని కోరారు.