News October 27, 2025

బల్కంపేట ఎల్లమ్మకి కార్తీక సోమవారం పూజలు

image

నగరంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. బల్కంపేట ఎల్లమ్మ క్షేత్రంలో వేకువ జామునుంచే అమ్మవారికి అభిషేకాలు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఎల్లమ్మ పోచమ్మ తల్లి కరుణించవమ్మ అనే నామస్మరణతో ఆలయం మార్మోగింది. పంచ హారతుల కోసం భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 30MIN పడుతోందని భక్తులు చెబుతున్నారు.

Similar News

News October 27, 2025

సంగారెడ్డి: ఈ వైన్స్‌ టెండర్‌ నిలిపివేత

image

సంగారెడ్డి జిల్లాలో ఓ వైన్స్‌ టెండర్‌ ప్రక్రియ నిలిచిపోయింది. మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన షాపు నంబర్‌ 24కు కేవలం 19 దరఖాస్తులు మాత్రమే రావడమే ఇందుకు కారణం. ఎక్సైజ్‌ శాఖ నిబంధనల ప్రకారం, ఒక దుకాణానికి కనీసం 20 దరఖాస్తులు రావాల్సి ఉంది. గత ఏడాది 40 దరఖాస్తులు వచ్చిన చోట ఈసారి సంఖ్య తగ్గడంతో, అధికారులు టెండర్‌ ప్రక్రియను నిలిపివేశారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

News October 27, 2025

MNCL: ఏబీవీపీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పెంట మహేందర్

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏబీవీపీ అధ్యక్షుడిగా పాత మంచిర్యాలకు చెందిన పెంట మహేందర్ నియమితులయ్యారు. కరీంనగర్లో ఈనెల 25, 26 తేదీల్లో జరిగిన జోనల్ మీటింగ్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్‌ను కార్పొరేషన్ కార్యదర్శిగా నియమించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నట్లు మహేందర్ తెలిపారు.

News October 27, 2025

నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

image

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీ‌షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.