News October 27, 2025
అనకాపల్లి: మొంథా తుఫానుపై ప్రత్యేక అధికారి ఆరా

మొంథా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సైక్లోన్ ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పర్యటించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం కూడా ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. తీర గ్రామాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక కావాలని ఆదేశించారు.
Similar News
News October 27, 2025
మొంథా తుపాన్‌పై జీవీఎంసీ అప్రమత్తం

మొంథా తుపాన్ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నగరంలో 55 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటయ్యాయి. 29 జేసీబీలు, 82 స్ప్రేయర్లు, 64 ఫాగింగ్ మెషిన్లు, 26 ట్రీ కట్టర్లు సిద్ధంగా ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోన్లలో కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు.
News October 27, 2025
పండుగ రోజుల్లో పకోడీలు తింటున్నారా?

పండుగంటే దైవారాధనలో నిమగ్నమవ్వడం. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో పకోడీలు తినడం వల్ల మనస్సు చంచలానికి గురై, నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది. పకోడీల్లో వేసే ఉల్లిపాయలకు తామసిక గుణాన్ని(ఉత్తేజాన్ని) పెంచే శక్తి ఉంటుంది. అందుకే పండుగ రోజున వీటిని తినకూడదని పండితులు చెబుతున్నారు. పర్వదినాల్లో భగవద్భక్తి, ప్రశాంతత ప్రధానం కాబట్టి ఇలాంటి ఆహారాన్ని దూరం ఉంచి, ఆ రోజును ఆధ్యాత్మిక నిష్ఠతో గడపాలని అంటున్నారు.
News October 27, 2025
యాదాద్రి: ప్రభుత్వ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన

మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన MRO, MPP కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం మెరుగైన వసతులతో కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


