News October 27, 2025

HYD: నిద్రలో గురక పెడుతున్నారా?

image

నిద్రలో శ్వాస లోపాలపై నిమ్స్‌లో అవగాహన సదస్సు జరిగింది. డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప మాట్లాడుతూ.. ‘ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది గుండె, మధుమేహంపై ప్రభావం చూపుతుంది’ అన్నారు. ప్రొ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ..‘గురక తీవ్ర వ్యాధికి సంకేతం. ఇది BP, గుండె జబ్బులకు దారి తీస్తుంది. పాలీ సామ్‌నోగ్రఫీ (Sleep Study) ద్వారా వెంటనే చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు. SHARE IT.

Similar News

News October 27, 2025

బాలీవుడ్ యువ నటుడి ఆత్మహత్య

image

బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో తన ఇంట్లో ఈనెల 23న ఆయన ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత మరో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఈ నెల 24న చనిపోయారు. ‘జంతారా సీజన్2’తో సచిన్ ఫేమస్ అయ్యారు. ఆయన నటిస్తున్న ‘అసుర్వన్’ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC

image

తొలి దశ SIR(సమగ్ర ఓటర్ జాబితా సవరణ) బిహార్‌లో విజయవంతమైనట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 1951-2004 మధ్య కాలంలో 8 సార్లు SIR జరిగినట్లు వెల్లడించారు. చివరగా 21 ఏళ్ల క్రితం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను అరికట్టి, అసలైన ఓటర్లను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

News October 27, 2025

సిద్దిపేట: ‘మేఘమా.. రైతును ఆగం చేయకుమా’

image

నంగునూర్ మండలంలో మేఘాలు దోబూచులాడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పనులు మానుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉంటున్నారు. వాన కురిసినట్టే చేసి మళ్లీ ఎండ దంచి కొట్టడంతో వారం రోజులుగా వడ్లు ఎండక రైతులు గోస పడుతున్నారు. ఈ వాతావరణ మార్పులు రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయి. వడ్లు ఎండి, ఎప్పుడు అమ్ముడుపోతాయోనన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జిలాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.