News October 27, 2025

HYD: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2026-27 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశాల కోసం NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు అక్టోబర్ 30తో ముగియనుంది. 10- 12 ఏళ్లు (6వ తరగతి), 13-15 ఏళ్లు (9వ తరగతి) మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి రెండో వారంలో జరుగుతుంది.

Similar News

News October 27, 2025

HYD వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి

image

రాబోయే రోజుల్లో తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారనుందని, HYD వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంటూ, 2030 నాటికి ఈ రంగం విలువ రూ.250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ అభివృద్ధి ద్వారా ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు.

News October 27, 2025

HYD: ఉపఎన్నిక హడావిడిలో సర్కార్ ‘రహస్య’ అజెండా!

image

జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడిలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టింది.తమ రెండేళ్ల పాలన విజయాల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని, మిడ్ నవంబర్ కల్లా ఈపురోగతి నివేదికను కచ్చితంగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ‘రహస్య’ ఆదేశాలు జారీ చేసింది. ఈ రిపోర్ట్‌పై తప్ప, రాబోయే 2వారాలు లోకల్ బాడీ ఎన్నికలపైనా కూడా దృష్టి పెట్టొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు కాంగ్రెస్ ఆంతర్యమేంటో?

News October 27, 2025

HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

image

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.