News October 27, 2025

HYD: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2026-27 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశాల కోసం NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు అక్టోబర్ 30తో ముగియనుంది. 10- 12 ఏళ్లు (6వ తరగతి), 13-15 ఏళ్లు (9వ తరగతి) మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి రెండో వారంలో జరుగుతుంది.

Similar News

News October 27, 2025

ASF: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ASF కలెక్టరేట్ భవన సముదాయంలో గల జీ 1 కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

News October 27, 2025

ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

image

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా డీపీఓలో ఏర్పాటుచేసిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. పోలీసు అమర వీరులను ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించామన్నారు.

News October 27, 2025

కామారెడ్డి: ప్రజావాణిలో 106 దరఖాస్తులు

image

సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వివిధ మండలాల దరఖాస్తుదారుల నుండి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్ అర్జీలను స్వీకరించారు. అనంతరం, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు మొత్తం 106 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.