News October 27, 2025
సంగారెడ్డి: వైజ్ఞానిక ప్రదర్శన పోటీలకు సిద్ధంకండి: జిల్లా సైన్స్ అధికారి

ఇన్‌స్పైర్ మనక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నవంబర్ రెండో వారంలో జరుగుతాయని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి సోమవారం తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రయోగాలు తయారు చేయాలని ఆయన కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు: అదనపు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఐడీవోసీలో ఆయన ప్రజల నుంచి 36 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు.
News October 27, 2025
సూర్యాపేట: ఈ దంపతులను వరించిన ‘లక్కీ’ డ్రా

సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మద్యం టెండర్ల లక్కీ డ్రాలో ఓ దంపతులను అదృష్టం వరించింది. వేములపల్లి మం. లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్ గెజిట్ నంబర్ 21లో, ఆయన భార్య శ్రావణి గెజిట్ నంబర్ 13లో దుకాణాలు దక్కించుకున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో దుకాణాల ఎంపిక చేశారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు షాపులు దక్కడంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News October 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 48 సమాధానాలు

1. హనుమంతుడి గురువు ‘సూర్యభగవానుడు’.
2. వ్యాసుని తల్లి ‘సత్యవతి’.
3. కుబేరుడి వాహనం ‘నరుడు’.
4. కామదహనం జరిగే పండుగ ‘హోళి’.
5. ఇంద్రుని వజ్రాయుధం చేసింది ‘దధీచి మహర్షి’.
<<-se>>Ithihasaluquiz<<>>


