News October 27, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసును సీఐడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబ ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.

Similar News

News October 27, 2025

ఇతిహాసాలు క్విజ్ – 48 సమాధానాలు

image

1. హనుమంతుడి గురువు ‘సూర్యభగవానుడు’.
2. వ్యాసుని తల్లి ‘సత్యవతి’.
3. కుబేరుడి వాహనం ‘నరుడు’.
4. కామదహనం జరిగే పండుగ ‘హోళి’.
5. ఇంద్రుని వజ్రాయుధం చేసింది ‘దధీచి మహర్షి’.
<<-se>>Ithihasaluquiz<<>>

News October 27, 2025

అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

image

AP: వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళం

image

హైదరాబాద్ పోలీసులు దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్‌ పోలీస్‌ విభాగంలో భాగమయ్యారు 9మంది మహిళా కానిస్టేబుళ్లు. వీరంతా 2024 ఆర్డ్మ్‌ రిజర్వ్‌ బ్యాచ్‌కి చెందిన వాళ్లు. వీరికి గుర్రపుస్వారీలో 6నెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ నారీమణులు.