News October 27, 2025

విజయవాడ: తుపాను ప్రభావంపై కలెక్టరేట్‌లో సమీక్ష

image

కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్‌బాబుతో పాటు వివిధ శాఖల అధికారులు సోమవారం తుపాను అప్రమత్తతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు వరి, పత్తి, మినుము, పెసర కోతలు చేయొద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలం స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంపై కలెక్టర్ చర్చలు జరిపారు.

Similar News

News October 27, 2025

GWL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పొరపాట్లు ఉండరాదు

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పొరపాటు లేకుండా గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2002 ఎన్నికల జాబితాను ప్రామాణికంగా తీసుకొని 2025 జాబితాతో నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. 2002 జాబితాలో ఉన్న వారిని A, లేనివారిని B, 22- 37 మధ్య వయస్సులను C, 18- 21 మధ్య వారిని D కేటగిరీలుగా విభజించామన్నారు.

News October 27, 2025

టూత్ పేస్ట్ అనుకోని ఎలుకల మందు తిన్న చిన్నారి మృతి

image

బ్రష్ చేసుకుంటుండగా టూత్‌పేస్ట్‌గా భావించి ఎలుకల మందు తిన్న మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మం(D) సింగరేణి(M) గోవింద్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన చిన్నారి ధారావత్ మానస(3) ఈ నెల 17న ఎలుకల మందు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మొదట ఖమ్మం ఆసుపత్రికి, ఆపై HYDకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపి దర్యాప్తు చేస్తున్నారు.

News October 27, 2025

పల్నాడు: ‘రేపు విద్యా సంస్థలకు సెలవు’

image

జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28వ తేదీని సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొంథా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.