News October 27, 2025
చోది మేళ్లలొ చోరీ.. రూ.15 లక్షల సొత్తు అపహరణ

ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చోదిమెళ్లకి చెందిన బాధితుడు వేమూరి అనంతరామ్ వివరాల మేరకు.. తాను తన కుటుంబంతో కలిసి 26న పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తిరిగి సోమవారం వచ్చి చూడగా, తలుపు తాళాలు, బీరువా ధ్వంసమై ఉన్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైందన్నారు. క్లూస్‌టీం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 27, 2025
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ

తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హన్మకొండలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 27, 2025
బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 27, 2025
ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.


