News October 27, 2025

జూబ్లీ బైపోల్స్: కీలకం కానున్న సినీ కార్మికులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సినీ కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. షేక్‌పేట, బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులున్నారు. దీంతో అభ్యర్థులు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమన్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.

Similar News

News October 27, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

image

HYDలోని బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తూములు మూసేసి అలుగుల ఎత్తు పెంచుతున్నారని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్ది కబ్జా చేస్తున్నారని మరి కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

News October 27, 2025

సికింద్రాబాద్: తుఫాన్.. ఆ రైళ్లు CANCEL

image

తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పలు రైళ్లను క్యాన్సల్ చేసింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి వెళ్లే రైళ్లను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు రైళ్ల రద్దు కొనసాగుతుందని CPRO శ్రీధర్ తెలిపారు.

News October 27, 2025

HYD: డబ్బు డబుల్ చేస్తామని మోసం.. నిందితుల అరెస్ట్..!

image

“బారిష్ పూజ” పేరిట డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బహదూర్‌పురకు వాసి, సోఫా వర్కర్ మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిల్మ్‌నగర్‌కి చెందిన మేకప్ ఆర్టిస్ట్ గుగులోత్ రవీందర్, సూరారం కాలనీలోని కవిర సాయిబాబా, ఖైరతాబాద్‌కు చెందిన వాషర్‌మన్ ఠాకూర్ మనోహర్ సింగ్ ఉన్నారు.పోలీసులు రూ.8.50లక్షల నగదు, దేశీయ తుపాకి, కత్తి స్వాధీనం చేసుకున్నారు.