News October 27, 2025

మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

image

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News October 27, 2025

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ 

image

తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హన్మకొండలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 27, 2025

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

image

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 27, 2025

ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

image

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.