News October 27, 2025
HYD: చిన్న శ్రీశైలం సహా 99 మంది బైండోవర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో కలిపి 100 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. నవీన్ యాదవ్ ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొన్నారన్న ఆరోపణలతో EC ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. బోరబండలో 74 మంది, మధురానగర్‌లో చిన్న శ్రీశైలం సోదరుడితో పాటు 19 మంది బైండోవర్ అయ్యారు. ఎన్నికల వేళ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News October 27, 2025
HYD: KCR పాలనలో చాలా దోచుకున్నారు: BJP కార్పొరేటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిని గెలిపిస్తే మళ్లీ తెలంగాణని దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టేనని సరూర్‌నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన ఆమె మాట్లాడారు. KCR పదేళ్ల పాలనలో చాలా దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఆలోచించి బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మేల్కోవాలని కోరారు. BRS పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
News October 27, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

HYDలోని బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తూములు మూసేసి అలుగుల ఎత్తు పెంచుతున్నారని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్ది కబ్జా చేస్తున్నారని మరి కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
News October 27, 2025
సికింద్రాబాద్: తుఫాన్.. ఆ రైళ్లు CANCEL

తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పలు రైళ్లను క్యాన్సల్ చేసింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి వెళ్లే రైళ్లను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు రైళ్ల రద్దు కొనసాగుతుందని CPRO శ్రీధర్ తెలిపారు.


