News October 27, 2025
మొంథా ఎఫెక్ట్.. ఏయూలో ఇంటర్వ్యూలు వాయిదా

మొంథా తుపాన్ కారణంగా ఏయూలో రేపు జరగాల్సిన వివిధ ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను నవంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు ఏయూ వెబ్‌సైట్లో పొందుపరిచారు.
Similar News
News October 27, 2025
క్షిపణి పరీక్షలు కాదు.. ముందు యుద్ధం ఆపండి: ట్రంప్

రష్యా <<18109096>>Burevestnik<<>> న్యూక్లియర్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షపై US ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ‘కొత్త న్యూక్లియర్ వెపన్స్‌ను పరీక్షించడంపై కాకుండా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడంపై మీరు దృష్టి పెట్టండి’ అని సలహా ఇచ్చారు. ఇది ఎలాంటి రక్షణ వలయాన్నైనా ఛేదించుకొని పోగలదని, ప్రపంచంలో ఇలాంటి క్షిపణి వ్యవస్థ మరెవ్వరి దగ్గరా లేదని రష్యా ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News October 27, 2025
తుఫాన్ పట్ల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రాబోయే మూడు రోజులలో మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండవచ్చని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ మండల అధికారులకు సూచనలు, సలహాలు చేస్తూ ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉంచాలన్నారు. రైతులు పండించిన పంటను, ఆరబోసుకున్న పంటలను రక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
News October 27, 2025
HYD: KCR పాలనలో చాలా దోచుకున్నారు: BJP కార్పొరేటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిని గెలిపిస్తే మళ్లీ తెలంగాణని దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టేనని సరూర్‌నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన ఆమె మాట్లాడారు. KCR పదేళ్ల పాలనలో చాలా దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఆలోచించి బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మేల్కోవాలని కోరారు. BRS పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.


