News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో త్వరలో రేవంత్ రెడ్డి ప్రచారం

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపు కోసం నాయకులు ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. 2రోజుల పాటు స్థానికంగా పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏఏ తేదీల్లో ప్రచారం చేయాలనేది గాంధీ భవన్ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.

Similar News

News October 27, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎంపీ గోపూజ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం యూసుఫ్‌గూడలో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఓ నివాసంలో దూడ కనపడే సరికి వారు దానికి పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరారు. ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

News October 27, 2025

హైదరాబాద్ సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 12 జోన్లలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 3,500 మంది దాతలు రక్తం ఇచ్చారు. థలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల త్యాగానికి ఇది నివాళి. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని తెలిపారు. పోలీసులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు.

News October 27, 2025

FLASH: HYD: పెళ్లి కోసం చనిపోయాడు..!

image

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో ఇంట్లో వారు <<18119524>>తనకు పెళ్లి చేయడం లేదంటూ<<>> ఈరోజు ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మాధవ్ తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు కాల్ చేయాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.