News October 27, 2025
DRC వద్ద మూడంచెల భద్రత.. ఎలా అంటే?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో DRC సెంటర్ వద్ద ఎన్నికల అధికారులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. మెయిన్‌గేటు వద్ద కొందరిని, రెండోగేటు వద్ద ఇంకొందరిని, స్టేడియం లోపల ఇంకొందరిని భద్రత కోసం వినియోగిస్తారు. ఇందుకోసం ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సాయుధ బలగాలు ఉంటాయి.
Similar News
News October 27, 2025
హైదరాబాద్ సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 12 జోన్లలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 3,500 మంది దాతలు రక్తం ఇచ్చారు. థలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల త్యాగానికి ఇది నివాళి. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని తెలిపారు. పోలీసులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు.
News October 27, 2025
FLASH: HYD: పెళ్లి కోసం చనిపోయాడు..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో ఇంట్లో వారు <<18119524>>తనకు పెళ్లి చేయడం లేదంటూ<<>> ఈరోజు ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మాధవ్ తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు కాల్ చేయాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
News October 27, 2025
HYD: BRSలోకి BJP మాజీ కార్పొరేటర్

చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెకు BRS సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ స్వాగతం పలికారు. సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తదితరులు నవతారెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. నవంబర్ 2న ఆదివారం తెలంగాణ భవన్‌లో KTR సమక్షంలో ఆమె BRSలో చేరనున్నట్లు వెల్లడించారు.


