News October 27, 2025
డ్రగ్స్ రహిత సమాజం కోసం సంఘటితంగా పోరాడాలి: స్వప్నారాణి

డ్రగ్స్ రహిత సమాజం కోసం సంఘటితంగా పోరాడాలని PDPL జిల్లా సీనియర్ సివిల్ జడ్జి(DLSA) స్వప్నారాణి పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో నశా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఆమె చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలు చెడువ్యసనాల జోలికి పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ డ్రగ్స్ ముప్పు నుంచి యువతను దూరంగా ఉంచాలని కోరారు.
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో ఎవరి పంతం నెగ్గుతుందో..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయమే కాదు PJR పిల్లల మధ్య కూడా నువ్వానేనా అన్నట్లుగా మారింది. స్థానిక ప్రజలకు PJR అంటే ఎనలేని అభిమానం. కాగా ఆయన కుమారుడు, మాజీ MLA విష్ణువర్ధన్ రెడ్డి BRSలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనని అంటున్నారు. PJR కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. BRSను ఓడగొడతామంటున్నారు. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.
News October 27, 2025
VKB: ధాన్యం, పత్తి కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

పత్తి, వరి ధాన్యం కొనుగోలను రైతులకు ఇబ్బంది కలగకుండా సరైన విధంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు రైస్ మిల్లర్లకు ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పత్తి, వరి ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.