News October 27, 2025
MNCL: ఏబీవీపీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పెంట మహేందర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏబీవీపీ అధ్యక్షుడిగా పాత మంచిర్యాలకు చెందిన పెంట మహేందర్ నియమితులయ్యారు. కరీంనగర్లో ఈనెల 25, 26 తేదీల్లో జరిగిన జోనల్ మీటింగ్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్‌ను కార్పొరేషన్ కార్యదర్శిగా నియమించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నట్లు మహేందర్ తెలిపారు.
Similar News
News October 27, 2025
కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.
News October 27, 2025
అన్నమయ్య: నిండు కుండను తలపిస్తున్న 459 చెరువులు

అన్నమయ్య జిల్లాలో 3089 చెరువులు ఉండగా 459 చెరువులు తుఫాను ప్రభావంతో పూర్తిస్థాయిలో నిండి, మొరవపోతున్నట్లు ఇరిగేషన్ జిల్లా జేఈ సిద్దేశ్వరి సోమవారం తెలిపారు. అలాగే 75 శాతం మేర నిండిన చెరువులు 508 ఉండగా.. 50 శాతం మేర నిండినవి 676 చెరువులు, 25 శాతం మేర నిండినవి 840 చెరువులు ఉన్నట్లు చెప్పారు. ఇకనిండని చెరువులు 606 ఉన్నట్లు పేర్కొన్నారు. మొంథా తుఫాన్‌తో మరో 75శాతం చెరువులు నిండి మొరవ పోవచ్చన్నారు.
News October 27, 2025
శ్రీకాకుళం: ‘విద్యుత్ సరఫరా అంతరాయానికి ఈ నంబర్లను సంప్రదించండి’

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి క్రిష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లో 9490610045, 9490610050 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిమనిన్నారు. విద్యుత్ లైన్లు తెగిపడినా.. స్తంభాలు పడిపోయిన తదితర సమస్యలు ఎదురైతే ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.


