News October 27, 2025

తుఫాన్ పరిస్థితులపై విశాఖ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ సమీక్ష

image

విశాఖ జిల్లాలో తుఫాను ప‌రిస్థితిని ప్ర‌త్యేకాధికారి, స్పెష‌ల్ సీఎస్ అజ‌య్ జైన్ పర్యవేక్షించారు. సోమవారం ఉదయం క‌లెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీలతో భేటీ అనంతరం తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. కొండ‌వాలు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లను స్థానిక‌ అధికారుల ద్వారా అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు. జేసీబీలు, జనరేటర్లు, కటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

Similar News

News October 27, 2025

ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్‌ఐ, సచివాలయ సెక్రటరీ

image

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

రుషికొండ బీచ్‌లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

image

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్‌ ప్రాంతాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, అడిషనల్‌ ఎస్పీ మధుసూదన్‌ పరిశీలించారు. బీచ్‌ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

News October 27, 2025

విశాఖ: మొంథా తుఫాను.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది

image

మొంథా తుఫానుపై వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని DMHO జగదీశ్వరరావు అప్రమత్తం చేశారు. 54 హెల్త్ వెల్‌నెస్, 66 పట్టణ, 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంచినీటి వనరులను బ్లీచింగ్ చేయాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏడు 104, పదహారు 108, ఇరవై మూడు 102 తల్లి బిడ్డ వాహనాలను తుఫాను ప్రాంతాల్లో ఫిషెర్మెన్ డిపార్ట్మెంట్‌తో కలిసి బోట్ క్లీనిక్స్‌గా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.