News October 27, 2025

నిర్మల్: ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తాం’

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ఫిర్యాదులను ఫునఃపరిశీలించి తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపుతామని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. గ్రామీణ, పట్టణ స్థాయి, వ్యవసాయ భూముల సంబంధిత దరఖాస్తులు అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల సిబ్బంది పనితనం మెరుగుపరచుకోవాలన్నారు.

Similar News

News October 27, 2025

MHBD: ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

రైతులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, సంబంధిత విభాగాల అధికారులతో కలెక్టర్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు.

News October 27, 2025

ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని నిర్మలారెడ్డి వినతి

image

సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల పాఠశాల, కళాశాలను సందర్శించినప్పుడు సమస్యల పరిష్కారానికి రూ.1.30 కోట్లతో ప్రతిపాదన తయారు చేయించినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి, కూన సంతోష్ పాల్గొన్నారు.

News October 27, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి: భద్రాద్రి కలెక్టర్

image

తెలంగాణ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.