News October 27, 2025

సైబర్ మోసాలకు గురికావొద్దు: వరంగల్ పోలీస్

image

పోలీస్, సీబీఐ అధికారులుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని పోలీసు శాఖ అప్రమత్తం చేస్తోంది.

Similar News

News October 27, 2025

నల్గొండలో 85% ధాన్యం కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దేవరకొండ, చండూరు డివిజన్లలో వరికోతలు ఆలస్యం కావడంతో, మిగిలిన కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. HYD నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కలెక్టర్ ఈ వివరాలు తెలిపారు.

News October 27, 2025

HYD: చున్నీతో గొంతు బిగించి భర్తను చంపింది..!

image

HYD బాలాపూర్ మండలం మీర్‌పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్‌మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం తాగి, వేధించే భర్తతో నిత్యం గొడవ జరుగుతుండడంతో అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

News October 27, 2025

సంగారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి’

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. దీంతో పాటు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు.