News April 9, 2024

పేటీఎం పేమెంట్స్ సీఈఓ రాజీనామా

image

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సురీందర్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని సంస్థ తెలిపింది. ‘వ్యక్తిగత కారణాలతో ఈ నెల 8న చావ్లా తన రాజీనామాను సమర్పించారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి ఆయన పదవి నుంచి అధికారికంగా తప్పుకొంటారు’ అని స్పష్టం చేసింది. గత ఏడాది జనవరిలో చావ్లా పేటీఎంలో చేరారు.

Similar News

News March 19, 2026

ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టుకు గంభీర్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

News March 19, 2026

హార్ముజ్ ఒక్కటే కాదు..: కేంద్రం

image

హార్ముజ్‌పై భారత్ డిపెండెన్సీ తగ్గిందని.. 70% క్రూడ్‌ ఇతర ప్రాంతాల నుంచి వస్తోందని కేంద్రం తెలిపింది. LPG సరఫరాను వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నామంది. రెగ్యులర్‌గా దిగుమతి చేసుకునే ఖతర్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు పెంచనున్నట్లు తెలిపింది. అవసరమైతే రష్యా నుంచి కూడా LPG కొంటామని పేర్కొంది. మరోవైపు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌ఛార్జ్ విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.

News March 19, 2026

అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

image

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో