News October 27, 2025
ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించాలి: కలెక్టర్

నంద్యాల జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ అభిప్రాయాలను సేకరించాలన్నారు. రాష్ట్రంలోనే మెరుగైన శాతాన్ని సాధించాలన్నారు.
Similar News
News October 28, 2025
నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.
News October 28, 2025
శంషాబాద్: మద్యం దుకాణాల లక్కీ డ్రాలో పాల్గొన్న కలెక్టర్

శంషాబాద్ పట్టణంలోని మల్లికా కన్వెన్షన్‌లో జరిగిన మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. 249 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. సరూర్‌నగర్ యూనిట్‌లో 138 రిటైల్ మద్యం దుకాణాలు, శంషాబాద్ యూనిట్ పరిధిలో మొత్తం 111 రిటైల్ మద్యం దుకాణాలకు ఎంపిక జరిగింది.
News October 28, 2025
MBNR: సౌత్ జోన్.. PU కబడ్డీ జట్టు READY

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్సిటీ స్త్రీల కబడ్డీ జట్టు చెన్నైలోని వినాయక మిషన్ ఫౌండేషన్ వర్సిటీకి బయలుదేరింది. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.జిఎన్ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్, మేనేజర్ ఉష పాల్గొన్నారు.


