News April 9, 2024
తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి మృతి

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ నరసింహారెడ్డి (48) మృతి చెందాడు. యావపూర్‌కు చెందిన సురేందర్ రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ద్విచక్ర వాహనంపై 4న వెళ్తున్నాడు. యావపూర్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Similar News
News March 7, 2026
మెదక్: ‘ప్రజా పాలన’ విజయవంతం చేయాలి: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మెదక్ MLA క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. MLA రోహిత్ రావు, MP సురేష్ షెట్కర్, MLA సంజీవరెడ్డి, DCC అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్లతో కలిసి ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు.
News March 5, 2026
హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 5, 2026
‘పీఎం సూర్య ఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలి: కలెక్టర్

ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో ‘పీఎం సూర్య ఘర్’ అవగాహన వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి సౌర విద్యుత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


