News October 27, 2025
సంగారెడ్డి: చెరువులో యువతి మృతదేహం లభ్యం

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానికులు చెరువులో మృతదేహాన్ని చూసి సమాచారం అందించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన ఫాతిమా(27)గా మృతదేహం వద్ద లభించిన ఆధారాల ద్వారా గుర్తించినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 28, 2025
వరంగల్: లక్కీ డ్రాలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

నూతన మద్యం పాలసీ 2025-27 కింద మద్యం షాపుల కేటాయింపునకు గాను వరంగల్‌లోని ఉర్సుగుట్ట వద్ద నాని గార్డెన్లో డ్రా నిర్వహించారు. ఈ లాటరీలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్, ఆయన భార్య గంప సాంబలక్ష్మి విజేతలుగా నిలిచారు. వీరికి నర్సంపేట పరిధిలోని షాప్ నెంబర్ 5, 38 కేటాయించారు. లక్కీ డ్రాలో గెలవడం పట్ల దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
News October 28, 2025
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలు: మంత్రి

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాం. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10-12% తగ్గిస్తుంది. భూసేకరణను సగానికి తగ్గిస్తుంది. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు ₹1,500-1,600Cr ఆదా చేస్తుంది’ అని చెప్పారు.
News October 28, 2025
ప్రారంభమైన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు: కలెక్టర్

వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను HNK జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాలలో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 7330751364ను సంప్రదించాలని సూచించారు.


